Andhra Pradesh : నేడు చంద్రబాబు కీలక సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మంత్రులు, హెచ్ఓడీలు, సెక్రటరీలతో సమావేశం కానున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మంత్రులు, హెచ్ఓడీలు, సెక్రటరీలతో సమావేశం కానున్నారు. ఈరోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ సచివాయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అన్నిజిల్లాల కలెక్టర్లు కూడా వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొంటారు.
విజన్ 2047 లోని...
2047 విజన్ లోని పది సూత్రాలపై అధికారులకు సమావేశంలో చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనున్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్దిదారులందరికీ చేరేలా అవసరమైన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించనున్నారు. అలాగే ప్రజల నుంచి వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరనున్నారు.