Chandrababu : అమరావతి మహానగరంగా మారాలంటే?

రాజధాని రైతు సమస్యల పరిష్కారంలో తొలుత కొంత గ్యాప్‌ ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు

Update: 2025-11-29 13:11 GMT

రాజధాని రైతు సమస్యల పరిష్కారంలో తొలుత కొంత గ్యాప్‌ ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. తనతో సమావేశం తర్వాత రైతులకు అన్నింటిపైనా స్పష్టత వచ్చిందని, రాజధాని రైతులు కూడా ఆనందంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. చిట్ చాట్ లో చంద్రబాబు మాట్లాడుతూ రెండో దశ భూసమీకరణ ఉపయోగాలను రైతులకు వివరించానని, అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోకూడదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

మున్సిపాలిటీగా ఉండకూడదు...
అమరావతి మహానగరంగా మారితే వచ్చే ఫలితాలు రైతులు అర్థం చేసుకున్నారన్న చంద్రబాబు త్రిసభ్య కమిటీ నిరంతరం రైతులతో సంప్రదింపులు జరుపుతుందని, రాజధాని అభివృద్ధి ఇక అనస్టాపబుల్‌ అని చంద్రబాబు చెప్పారు. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో లేఅవుట్ల సమస్య త్వరలోనే పరిష్కరిస్తామన్న చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తిచేసే దిశగా కృషిచేస్తున్నామని తెలిపారు.


Tags:    

Similar News