Chandrababu : నేడు టీడీపీ ఎంపీలతో చంద్రబాబు
చంద్రబాబు నేడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులతో సమావేశం కానున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులతో సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీపీ పార్లమెంటరీ సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహలను పార్లమెంటు సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు.
పార్లమెంటులో...
ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులతో పాటు రాజధాని అమరావతికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల తో పాటు పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది పూర్తయ్యేందుకు అవసరమైన నిధులను సమీకరించే దిశగా ప్రయత్నాలు చేయాలని, అలాగే పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నంచి అవసరమైన సహకారాన్ని అందించేలా పని చేయాలని ఎంపీలను ఆదేశించనున్నారు. పార్లమెంటులో లేవెనెత్తాల్సిన అంశాలపై కూడా ఎంపీలకు సూచించనున్నారు.