Chandrababu : మంత్రుల పనితీరుపై చంద్రబాబు మరోసారి అసహనం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మంత్రుల పనీతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు

Update: 2025-12-10 12:07 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మంత్రుల పనీతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు జరిగిన హెచ్ఓడీల సమావేశంలో మంత్రుల పనితీరును ఆయన తప్పుపట్టారు. మరోసారి మంత్రులపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు రాలేదని చంద్రబాబు అన్నారు.

ఢిల్లీకి వెళ్లి కేంద్ర నిధులను...
చాలా మందికి తమ శాఖల్లో ఏం జరుగుతుందో తెలియడంలేదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తేవడం, వినియోగించడంలో విఫలమయ్యారంటూ అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు ఒక్కరోజు ఢిల్లీకి వెళ్లడంలో నష్టం లేదన్న చంద్రబాబుర ఇకనైనా మంత్రులు పనితీరు మార్చుకోవాలని, ఫైళ్ల క్లియరెన్స్ లోనూ వేగంగా స్పందించాలని చంద్రబాబు ఆదేశించారు.


Tags:    

Similar News