Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఢిల్లీోని 1 జనపథ్ నుంచి తాజ్ మహల్ హోటల్ కు ఉదయం 10.20 గంటలకు చేరుకుంటారు. ఉదయం 10.30 గంటలకు గూగుల్ తో ఏపీ ప్రభుత్వం చేసుకునే ఎంఓయూ కార్యక్రమంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం అమరావతికి...
అనంతరం మధ్యాహ్నం 1.10 గంటలకు ఢిల్లీ నుంచి అమరావతికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 3.45 గంటలకు చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. అనంతరం ముందుగా అపాయింట్ మెంట్ తీసుకున్న కొందరు అధికారులు, పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారని చెప్పారు.