Chandrababu : సదస్సులో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడమే కాదని...అనవసర ఫైళ్లు సృష్టించే విధానం మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడమే కాదని...అనవసర ఫైళ్లు సృష్టించే విధానం మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హెచ్.ఓ.డీలు, కార్యదర్శుల సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగాన్నే అనేక సార్లు సవరించుకున్నామని, ప్రజలకు మంచి చేయడానికి బిజినెస్ రూల్స్ మార్చుకుంటే తప్పేంటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. దీని కోసం అవసరం అయితే బిజినెస్ రూల్స్‌ను మార్చాలని సీఎం అన్నారు. పాలనను సులభతరం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని...దీని కోసం అధికారులు అనవసరంగా ఉన్న నిబంధనలను తొలగించాలన్నారు. శాఖల్లో పూర్తిస్థాయి మార్పులు తీసుకురావాలని..టెక్నాలజీ, డేటాలేక్ ద్వారా మరింత సమర్థంగా పాలన అందించాలన్నారు.
జవాబు దారీగా ఉంది...
ప్రతి శాఖలో ఆడిటింగ్ జరగాలని స్పష్టం చేశారు. ప్రతి అధికారి, ప్రతిశాఖ పనితీరు ఏ విధంగా ఉందో ప్రభుత్వం వద్ద పూర్తిస్థాయిలో సమాచారం అందుబాటులో ఉందని...దీన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ...విజన్‌తో ప్రతి అధికారి పనిచేయాలని సీఎం సూచించారు. అధికారులు ఎవరూ ప్రతికూల ఆలోచనలు చేయవద్దన్నారు. ఏ పని చెప్పినా, ఏ కార్యక్రమం తలపెట్టినా కొందరు ప్రతికూల ఆలోచనలు చేస్తున్నారని, ఎలా ఆ పనిచేయకుండా ఉండాలి అనే విధంగా కొంతమంది ఆలోచిస్తున్నారని అన్నారు. ఈ పద్దతిని విడనాడాలని స్పష్టం చంద్రబాబు చేశారు. ప్రభుత్వం ఒక కార్యక్రమం తలపెట్టినా, ఒక ఆదేశం ఇచ్చినా సానుకూలంగా తీసుకుని దాన్ని అమలు చేయాలని చంద్రబాబు అధికారులకు ఆదేశించారు.