Amaravathi : నేడు రాజ్యసభలో అమరావతి బిల్లు
నేడు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రానుంది
నేడు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రానుంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్బంగా దాదాపు రెండు గంటల పాటు చర్చ జరగనుంది. నిన్న లోక్ సభలో అమరావతి బిల్లు ఆమోదం పొందడంతో నేడు దానిని రాజ్యసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత...
రాజ్యసభలోనూ అమరావతి చట్టానికి ఎటువంటి ఇబ్బంది లేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనుకూలంగా ఉండటంతో సులువుగానే ఈ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందుతుంది. అనంతరం ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి వద్దకు పంపుతారు. రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.