రేపు పార్లమెంట్‌లో ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు

రేపు పార్లమెంట్‌లో ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు రానుంది

Update: 2026-03-31 04:18 GMT

రేపు పార్లమెంట్‌లో ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు రానుంది. అమరావతి చట్టబద్ధతపై అసెంబ్లీ తీర్మానానికి రేపు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. అనంతరం కేబినెట్ ఆమోదం తర్వాత బిల్లును పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం ప్రభుత్వానికి పంపిన సంగతి తెలిసిందే.

అమరావతికి చట్టబద్ధత...
ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు అమరావతిని రాజధానిగా చట్టబద్ధత కల్పించే తీర్మానం చేసి పంపాలని సూచించగా ప్రభుత్వం వెంటనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి తీర్మానం చేసి పంపింది. రేపు పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందితే ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత లభిస్తుంది.


Tags:    

Similar News