ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశేపెట్టారు. ఈ బిల్లుపై దాదాపు రెండు గంటల పాటు చర్చ జరగనుంది. చర్చ అనంతరం లోక్ సభ ఆమోదించి అనంతరం రాజ్యసభకు ఈ బిల్లును పంపనుంది.
రేపు రాజ్యసభ ముందుకు...
రేపు రాజ్యసభ ముందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభలోనూ చర్చ జరిగిన అనంతరం బిల్లు ఆమోదం పొందుతుంది. ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి వద్దకు ఈ బిల్లును పంపుతారు. రాష్ట్రపతి రాజధాని అమరావతి నోటిఫికేషన్ ను విడుదల చేస్తారు.