Breaking : అమరావతి బిల్లుకు లోక్ సభలో ఆమోదం
ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యస్థీకరణ బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించింది
ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యస్థీకరణ బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశేపెట్టారు. ఈ బిల్లుపై దాదాపు రెండు గంటల పాటు చర్చ జరిగింది. వైసీపీ బిల్లులో ఉన్న వ్యవహారాలు తమకు నచ్చలేదంటూ వాకౌట్ చేసి వెళ్లారు.
వైసీపీ వాకౌట్...
దాదాపు అన్ని పార్టీలు అమరావతి చట్టబద్ధత కోసం ప్రవేశపెట్టిన బిల్లును సమర్థించారు. అయితే రాజధానికి భూములిచ్చిన రైతులను ఆదుకోవాలని సమాజ్ వాదీ పార్టీ నేతలు కోరారు. అనంతరం లోక్ సభ ఆమోదించి అనంతరం రాజ్యసభకు ఈ బిల్లును పంపనుంది. రేపు రాజ్యసభలో అమరావతి బిల్లు పై చర్చ జరగనుంది.