Chandrababu : హైదరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్.. ఇక్కడ ఆర్థిక నగరం
ఆర్థిక సంస్థలన్నీ ఒకే చోట ఏర్పడటం దేశంలోనే ఇక్కడే ప్రధమమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
ఆర్థిక సంస్థలన్నీ ఒకే చోట ఏర్పడటం దేశంలోనే ఇక్కడే ప్రధమమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కొత్త రాజధాని ఆర్థిక రాజధానిగా కూడా మారాలంటే ఈ ఆర్థిక సంస్థలన్నీ ఒకే చోట ఏర్పాటు కావాలని అన్నారు. గతంలో తాను హైదరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ను ఏర్పాటు చేశానని, మళ్లీ ఇక్కడ ఆర్థిక నగరం నిర్మించే అవకాశం తనకు దక్కిందేని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర, కేంద్ర స్థాయి కార్యాలయాలు అమరావతిలో ఏర్పాటు చేయాలని తన నిర్ణయం వెనక కూడా ఇదే కారణమని అన్నారు. ఆర్థిక హబ్ గా అమరావతి మారబోతుందని చంద్రబాబు అన్నారు.
నిర్మలా సీతారామన్ సౌకర్యంతోనే...
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సామర్థ్యం, ప్రధాని మోదీ నేతృత్వంలో మరో ఏడాదిలో ప్రపంచంలోనే నెంబరు వన్ గా అవతరిస్తుందన్న నమ్మకం తనకు ఉందని చంద్రబాబు అన్నారు. ఒకేసారి పదిహేను బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఏర్పాటు చేయడంతోనే అమరావతికి ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు వచ్చిందన్నారు. గత ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసం నుంచి బయటపడి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు నిర్మలా సీతారామన్ సహకరించారని చంద్రబాబు అన్నారు. ప్రతి ఇంట్లో మహిళ ఆర్థిక మంత్రి ఉంటారని అన్నారు. వెంటిలేటర్ పై ఉండే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని బయటకు తీసుకు రావడంలో ప్రధానితో పాటు నిర్మలా సీతారామన్ సహకారం తమకు ఉపయోగపడిందని చంద్రబాబు తెలిపారు.