Andhra Pradesh : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రాజధాని ఇక
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ విడుదల చేయనుంది. వచ్చే నెలలో ఈ గెజిట్ విడుదలయ్యే అవకాశముంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో గెజిట్ బిల్లును ప్రవేశపెట్టి డిసెంబర్ నెలలో ఏపీ రాజధాని 'అమరావతి'గా గెజిట్ ను విడుదల చేసే అవకాశముంది.
డిసెంబరు నెలలో...
పార్లమెంట్ లో గెజిట్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని టీడీపీ ఎంపీలు కూడా చెబుతున్నారు. అమరావతి గెజిట్ కు సంబంధించి డిసెంబర్ లో బిల్లు ఉంటుందని రైతులకు సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఏ రాజధానికీ గెజిట్ లేదని కమిషనర్ చెప్పినట్లు సమాచారం. దీంతో రాజధాని అమరావతి ఇక స్థిరంగా ఎవరు వచ్చినా న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుంది.