Amaravathi : అమరావతి వాసులకు గుడ్ న్యూస్
అమరావతికి రాజధాని హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లు తీసుకురానుంది.
అమరావతికి రాజధాని హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లు తీసుకురానుంది. అమరావతిని అధికారికంగా రాజధానిగా ప్రకటించేందుకు కేంద్రం సవరణ బిల్లును తీసుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణ ద్వారా అమరావతిని స్పష్టంగా రాజధానిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
చట్టబద్ధత కల్పించేందుకు...
దీనికి న్యాయశాఖ ఆమోదం లభించిందని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ ఆమోదం తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జారీచేస్తే అమరావతి రాజధాని హోదాకు చట్టబద్ధత ఏర్పడుతుంది. గత కొన్నాళ్లుగా అమరావతి రాజధానికి చట్ట బద్ధత కల్పించాలన్న డిమాండ్ వినపడుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లోనే కీలక బిల్లు తేనుంది.