Nirmala Sitharaman : ఏపీ రాజధాని శరవేగంగా అభివృద్ధి ఖాయం
రాజధాని అమరావతిని తిరిగి ప్రారంభించడం ఒక బృహత్ సంకల్పమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు
రాజధాని అమరావతిని తిరిగి ప్రారంభించడం ఒక బృహత్ సంకల్పమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. శాస్త్రీయ థృక్ఫధంతో నిర్మించ తలపెట్టిన రాజధానిలో ఫైనాన్షియల్ సపోర్టు ఉండాలని భావించి ఈ రోజు పదిహేను బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఏర్పాటు చేయడానికి శంకుస్థాపనలు చేయడం మంచి పరిణామమని నిర్మలా సీతారామన్ అన్నారు. రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు భుజాలపైకి ఎత్తుకుని చేస్తున్నారని అన్నారు. బ్యాంకులకు కూడా తాను ఒక సూచన చేస్తున్నానని, రైతులను విస్మరించవద్దని కోరారు.
రైతులకు అండగా...
రైతులు చేసిన త్యాగాన్ని మరిచిపోలేమని, బ్యాంకింగ్, బీమా కంపెనీలు రైతులకు పూర్తి సహకారం అందించాలని నిర్మలా సీతారామన్ తెలిపారు. పంట అంటే వరి, మొక్క జొన్న మాత్రమే కాదని, పండ్లు, కూరగాయలకు మంచి డిమాండ్ ఉందని తెలుసుకోవాలన్నారు. కాయగూరలు, పండ్లు హబ్ లాగా చేసి ఫుడ్ సెక్యూరిటీ అవసరమైనప్పుడు అన్ని రకాలుగా బ్యాంకింగ్ రంగం సహకరించాలని నిర్మలా సీతారామన్ కోరారు. ఆంధ్రప్రదేశ్ ను శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ అభివృద్ధి చేయాలని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.