Andhra Pradesh : మహా కుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలు
మహా కుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది
మహా కుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయం 2027 గోదావరి పుష్కరాల పై ఏర్పాటైన మంత్రి వర్గ ఉప సంఘం భేటీ అయింది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన ఉప సంఘం సమావేశంలో మంత్రులు కందుల దుర్గేష్, బి. సి జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి కుమార్, మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రధానంగా ఐదు అంశాలపై భేటీలో సుదీర్ఘ చర్చ జరిగింది. గత భేటీలోని అంశాలు, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై చర్చ జరిగింది. దాదాపు 8 నుంచి10 కోట్ల మంది పుష్కరా స్నానాలు ఆచరించే అవకాశం ఉందని అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. 2027 జూన్ 26 నుండి జులై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలు 6 జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. 4516 మీటర్ల మేర 373 ఘాట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనను రూపొందించారు.