Nara Lokesh : అమరావతిలో మూడు తరాలు కలసి నివసించేలా ఇంటి నిర్మాణం

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-12-04 04:42 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబం రాజధాని అమరావతిలోనే నివాసముంటుందని తెలిపారు. అమరావతిలో కుటుంబ నివాస నిర్మాణ పనులను నారా లోకేశ్ పరిశీలించారు. ప్రజా రాజధాని అమరావతిలోనే ఇప్పుడు తమ ఇల్లు కూడా ఉందని ఈ సందర్భంగా లోకేశ్ అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామని తెలిపారు.

బలమైన పునాదులు....
మూడు తరాలకు చెందిన నారా కుటుంబం ఒకే ఇంట్లో కలిసి ఉండేలా అమరావతిలో తమ నివాసం నిర్మాణం కొనసాగుతుందని నారా లోకేశ్ తెలిపారు. బలమైన పునాది, పంచుకున్న విలువలతోనే పురోగతి మొదలవుతుందని నారా లోకేశ్ తెలిపారు. త్వరలోనే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేశ్ ఈ సందర్భంగా తెలిపారు. ఇంటి నిర్మాణ పనులను పరిశీలించిన లోకేశ్ అక్కడి వారికి కొన్ని సూచనలు చేశారు.


Tags:    

Similar News