ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. కృష్ణపట్నం పారిశ్రామిక క్యారిడార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణపట్నం నోడ్ - చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‍ కు గెజిట్ విడుదల చేసింది

Update: 2025-08-23 05:50 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. 10,834 ఎకరాల్లో కృష్ణపట్నం నోడ్ - చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‍ లో ప్రతిపాదన చేసింది. దీనివల్ల ఎగుమతులు మరింత ఎక్కువయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. దీంతో పాటు ఆ ప్రాంత అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని తెలిపింది.

గెజిట్ విడుదల...
కృష్ణపట్నం ఉత్తర నోడ్‍ను 10,834 ఎకరాల్లో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణపట్నం నోడ్ మాస్టర్ ప్లాన్‍ను ఆమోదిస్తూ ప్రభుత్వం గెజిట్ ను విడుదల చేసింది. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా కూటమి ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. త్వరలోనే పనులు ప్రారంభించాలని నిర్ణయించింది.


Tags:    

Similar News