Andhra Pradesh : అప్పీల్ చేసుకున్న వారందరికీ పింఛన్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. నోటీసులు అందుకున్న వారందరూ అప్పీల్ చేసుకుంటే వారికి పింఛన్లు ఇస్తామని తెలిపింది

Update: 2025-08-30 04:44 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. నోటీసులు అందుకున్న వారందరూ అప్పీల్ చేసుకుంటే వారికి పింఛన్లు ఇస్తామని తెలిపింది. ఈ నెల 1వ తేదీన అప్పీల్ చేసుకున్న వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు ఈ ప్రకటన చేశారు.

ఎల్లుండి ఇస్తామన్న...
దివ్యాంగులు, హెల్త్ పింఛన్లకు సంబంధించి.. పునఃపరిశీలనకు అప్పీల్ చేసుకున్న అందరికీ పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆయా కేటగిరీల పెన్షన్లను ఎనిమిది నెలలుగా తనిఖీ చేస్తోన్న వైద్యారోగ్యశాఖ అధికారుల కొందరికి నోటీసులు ఇచ్చారు. 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి వైద్యారోగ్యశాఖ నోటీసులు అందచేయడంతో వారు ఆందోళనకు దిగడంతో చంద్రబాబు అందరికీ ఈ నెల పింఛను ఇవ్వాలని ఆదేశించారు.


Tags:    

Similar News