Andhra Pradesh : దివ్యాంగులకు గుడ్ న్యూస్.. ఉచితంగా త్రీ వీలర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దివ్యాంగులకు ఉచిత త్రీ-వీలర్ మోటార్ సైకిల్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలను రూపొందించింది. ఈ పథకం కింద త్రీ వీలర్ పొందాలంటే పద్దెనిమిదేళ్ల నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు వయసు ఉండాలి. కనీస విద్యార్హత పదో తరగతిగా నిర్ణయించింది. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన విధించింది.
నిబంధనలివే...
అన్నీ అర్హతలున్న వారందరికీ ఉచితంగా త్రీవీలర్ మోటర్ సైకిల్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద అర్హులై వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల చివరి తేదీగా 25-11-2025 గా నిర్ణయించారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. పూర్తి వివరాలకు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్: https://apdascac.ap.gov.in/ ను చూడొచ్చు.