Andhra Pradesh : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్
విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకటి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరంలో కిట్లను పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. మొత్తం 830.04 కోట్ల నిధుల విడుదలకు ఏపీ ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సర్వేపల్లి రాధా కృష్ణన్ విద్యార్థి మిత్ర పేరిట రాష్ట్ర ప్రభుత్వం కిట్లను పంపిణీ చేస్తోంది.
830 కోట్ల నిధులు విడుదల...
నోట్ బుక్‌లు, బెల్ట్, షూలు, బ్యాగ్, డిక్షనరీలు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, 3 జతల యూనిఫాం క్లాత్‌లను ఇవ్వనుంది. కిట్ల సేకరణ, పంపిణీ కోసం రూ. 157.20 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. టెండర్ల ప్రక్రియ ద్వారా కిట్ల సరఫరా, పంపిణీ దారులను నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు