Andhra Pradesh : నేడు అమరావతిలో చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని...
తిరుమల తరహాలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకు వచ్చింది. ఇందుకు 260 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. రెండు దశల్లో ఈ ఆలయ అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. చంద్రబాబు నాయుడు ఆలయానికి వస్తుండటంతో ఈ ప్రాంత రైతులు కూడా తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే అవకాశముంది.