Andhra Pradesh : రేపు జరగాల్సిన కేబినెట్ సమావేశం 29 తేదీకి వాయిదా
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. వాస్తవం ఈ నెల 24న జరగాల్సి ఉండగా 29వ తేదీకి మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మార్పు చేసింది. అయితే ఈ నెల 29న ఏపీ కేబినెట్ సమావేశం యధావిధిగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
కీలక నిర్ణయాలివే...
ఈ నెల 29వ తేదీన జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. అలాగే అమరావతి రాజధానికి సంబంధించి సీఆర్డీఏ ఆమోదించిన వాటిని చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పలు సంస్థలకు భూకేటాయింపులు జరిపే అవకాశాలున్నాయి. అలాగే మరికొన్ని కీలక అంశాలపై చర్చించి మంత్రి వర్గ సమావేశం నిర్ణయం తీసుకోనుంది.