Andhra Pradesh : మంత్రి వర్గ సమావేశంలో ఏడ్చేసిన మంత్రి
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాయచోటి ని కడప జిల్లాకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా మదనపల్లి, రంపచోడవరం, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జిల్లాల పునర్విభజనపై చర్చ జరిగిన తర్వాత ఈ మేరకు ఆమోదించింది. జిల్లాల సంఖ్యను ఇరవై ఎనిమిదికి పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలసింది.
మంత్రి వర్గ సమావేశంలో...
అయితే మంత్రివర్గ సమావేశంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజంపేట జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మారుస్తూ నిర్ణయం తీసుకోవడంతో మంత్రి వర్గ సమావేశంలోనే త్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యంత మయ్యారు. దీంతో చంద్రబాబు నాయుడు త్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఓదార్చినట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశం నుంచి బయటకు వస్తూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకుంటూనే మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.