Amaravathi : రైతుల అభిప్రాయం మేరకే నిర్ణయాలు

రాయ‌పూడి సీఆర్డీఏ కార్యాల‌యంలో త్రిస‌భ్య క‌మిటీ స‌మావేశం ముగిసింది.

Update: 2025-12-13 07:07 GMT

రాయ‌పూడి సీఆర్డీఏ కార్యాల‌యంలో త్రిస‌భ్య క‌మిటీ స‌మావేశం ముగిసింది. రాజ‌ధాని రైతుల స‌మ‌స్య‌ల‌పై క‌మిటీ చ‌ర్చించింది. స‌మావేశానికి మంత్రి నారాయ‌ణ‌,కేంద్ర మంత్రి పెమ్మ‌సాని,ఎమ్మెల్యే శ్రావ‌ణ్ కుమార్,అధికారులు హాజరయ్యారు. రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై స‌మావేశంలో ప్ర‌ధానంగా చ‌ర్చించారు.ఏడు వందల మంది రైతుల‌కు చెందిన 921 ప్లాట్ లు ల్యాండ్ పూలింగ్ కు ఇవ్వ‌ని భూమిలో వ‌చ్చాయని కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు. అలాంటి రైతుల‌కు ఫోన్ లు చేసి వారి అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు. చాలామంది రైతులు ల్యాండ్ అక్విజిష‌న్ త‌ర్వాత అవే ప్లాట్ లు తీసుకుంటామ‌ని చెప్పారన్నారు.

వేరేచోట ప్లాట్లు కేటాయించాలని...
37 మంది రైతులు వేరే చోట ప్లాట్ లు కేటాయించ‌మ‌ని అడిగారన్నారు. జరీబు,గ్రామ కంఠం ప్లాట్ ల‌పై క‌మిటీ నివేదిక ఆధారంగా 15 రోజుల్లో నిర్ణ‌యం తీసుకుంటామన్న మంత్రి పెమ్మసాని రైతుల‌కు కేటాయించిన ప్లాట్ల‌లో ఇప్ప‌టివ‌ర‌కూ 61,793 ప్లాట్ల రిజిస్ట్రేష‌న్ పూర్త‌యిందని తెలిపారు. ఇంకా కేవ‌లం 7628 ప్లాట్లు మాత్ర‌మే రిజిస్ట్రేష‌న్ చేయాల్సి ఉందని చెప్పారు. ఉండవల్లిలో భూమి ఇచ్చిన‌ రైతులకు త్వరలో లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయిస్తామని తెలిపారు. R5 జోన్ పై న్యాయ‌స‌ల‌హా తీసుకుంటున్నామని చెప్పారు. అమరావతి రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో 3 మెన్ కమిటీ ద్వారా పరిష్కరిస్తుందని తెలిపారు. జనరల్ ఇష్యూస్, మేజర్ ఇష్యూస్‌గా సమస్యలను విభజించి ఒక్కొక్క అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు.


Tags:    

Similar News