Amaravathi : అమరావతి లో మరో సెంటిమెంట్ అంశం ఇదే

రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం అవుతున్న సమయంలో సెంటిమెంట్ అంశం ముందుకొచ్చింది.

Update: 2025-12-01 04:38 GMT

AP amaravathi

రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం అవుతున్న సమయంలో సెంటిమెంట్ అంశం ముందుకొచ్చింది. ఇప్పుడున్న గ్రామాల్లో అంతిమ సంస్కారాలకు అవసరమైన శ్మశానవాటికలపై కొద్దికాలంగా చర్చ జరుగుతోంది. ఇటీవల ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని రైతులు ముందుకు తీసుకొచ్చారు. రాజధాని ఒకే నగరంగా మారుతున్న నేపథ్యంలో ఒకటి లేదా రెండుచోట్ల శ్మశానవాటికలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికోసం ఇప్పటికే. శాఖమూరు పరిధిలో అధునాతన పద్ధతుల్లో శ్మశానవాటిక నిర్మించారు. అయితే రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో రైతులు గ్రామాల వారీ శ్మశానవాటికలు కావాలని తెలిపారు.

శ్మశాన వాటికల నిర్మాణాలకు...
కొన్ని గ్రామాల్లో రహదారుల పనుల పేరుతో వాటికి వెళ్లే రహదారులు తవ్వేశారని, దీనివల్ల ఇబ్బంది అవుతోందని పేర్కొన్నారు. ఎంతటివారైనా చివరకు తన స్వగ్రామంలోనే అంతిమ సంస్కారాలు నిర్వహించాలని కోరుకుంటారని, కనుక ఆ విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం స్పందించారు. వెంటనే గ్రామాల వారి ఎక్కడెక్కడ శ్మశానాలు ఏర్పాటు చేయాలి, అన్ని మతాలకూ ఒకేచోట పెట్టాలా లేక వేర్వేరుగా ఏర్పాటు చేయాలా అనే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. అలాగే గ్రామాల వారి ప్రజల అభిప్రాయం తీసుకుని నివేదిక తయారు చేయాలని, దీని ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు


Tags:    

Similar News