Amaravathi : కేంద్రమంత్రి పెమ్మసాని సమీక్ష
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సీఆర్డీఏ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సీఆర్డీఏ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో నెలకొన్న సమస్యలతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఏ మేరకు అమలవుతున్నాయన్న దానిపై మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సీఆర్డీఏ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. రైతు సమస్యల పరిష్కారంపై కూడా ఆయన ఆరా తీస్తున్నారు.
రైతుల సమస్యలపై...
రాజధాని అమరావతి రెండో విడత భూ సేకరణకు సంబంధించిన గ్రామసభలు, రైతుల నుంచి వస్తున్న స్పందన ను అడిగి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సీఆర్డీఏ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సమీక్షలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమీషనర్ పాల్గొన్నారు. రైతుల సమస్యలపై పరిష్కార చర్యల పురోగతిపై కేంద్రమంత్రి పెమ్మసాని సమీక్ష జరుపుతున్నారు. అలాగే రాజధాని నిర్మాణ పనులపై సమావేశంలో చర్చించనున్నారు.