Pawan Kalyan : బస్సు ప్రమాదంపై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే?
కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు
కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్ కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద బైక్ ను ఢీకొని మంటలు చెలరేగడంతో బస్ దగ్ధమై, ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ ఘటనలో ఇప్పటికే 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు.
ఇకపై రవాణాశాఖ అధికారులు...
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం తరపున సూచించడం జరిగిందని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలుగా భద్రతా ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపట్టాలని రవాణా శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.