Breaking : రాజధాని కడుతున్నాం.. చందాలివ్వండి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది

Update: 2026-01-25 12:19 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్డీఏ వెబ్ సైట్ లో క్యూ ఆర్ క్యూ కోడ్ ను ప్రవేశపెట్టింది. సీఆర్డీఏ అధికారిక వెబ్ సైట్ ప్రభుత్వం లింక్ ఇచ్చింది. ఈ క్యూ ఆర్ కోడ్ ద్వారా రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళాలు పంపాలని కోరింది. విరాళాలు పంపేవారు నేరుగా క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి పంపవచ్చని తెలిపింది.

విరాళాల సేకరణకు...
రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యుల్ని చేసేందుకు ఈ విరాళాలను సేకరించాలని నిర్ణయించింది. రాజధాని అమరావతి అందరిదీ అన్న భావన కలిగేంచేందుకు విరాళఆలు సేకరించాలని, క్యూ ఆర్ క్యూ కోడ్ ద్వారా స్కాన్ చేసి విరాళాలు పంపితే నేరుగా సీఆర్డీఏ అకౌంట్ లోకి తమ బ్యాంకు అకౌంట్ నుంచి నేరుగా విరాళాలు జమ అవుతున్నాయి.


Tags:    

Similar News