ఈనెల 18న అమరావతికి బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈనెల 18న రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు

Update: 2026-02-04 04:31 GMT

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈనెల 18న రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కానున్నారు. గత ఏడాది 'బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్'తో కుదుర్చుకున్న ఒప్పందాల పురోగతిపై చర్చించనున్నారు. ముఖ్యంగా వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా రంగాల్లో ఏఐ వినియోగంపై ఈ సమావేశం సాగనుంది.

చంద్రబాబుతో కీలక భేటీ...
అమరావతి 'క్వాంటం వ్యాలీ'లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. బిల్ గేట్స్ తో ఒప్పందం అమరావతికి మాత్రమే కాకుండా రాష్ట్రానికి పలు రకాల ప్రయోజనాలను చేకూరుస్తుందని అంటున్నారు. బిల్ గేట్స్ అమరావతికి రానుండటంతో ఆయనకు ఏపీ రుచులను ప్రభుత్వం అందించనుంది.


Tags:    

Similar News