ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్
సచివాలయ ఉద్యోగులకు రంజాన్ మాసం సందర్భముగా హాజరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంమినహాయింపు ఇచ్చింది.
స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు ముస్లిం సామాజికవర్గానికి చెందిన ఉద్యోగులకు రంజాన్ మాసం సందర్భముగా హాజరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంమినహాయింపు ఇచ్చింది. ముస్లిం ఉద్యోగులకు సాయంత్రం నాలుగు గంటలకే అటెండెన్స్ అవుట్ మార్క్ చేసే సడలింపు ఇచ్చారు. యాప్ లో నాలుగు గంటలకు అవుట్ అనుమతించకపోతే.. వారు తప్పనిసరిగా HRMS ప్రొఫైల్ లో Religion ముస్లిం అని సెలెక్ట్ చేసుకోవాలి.
అలా చేసుకున్న వారికి...
అలా చేసుకున్న వారికి మాత్రమే ఈ సడలింపు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. సాయంత్రం వేళ నమాజు చేసుకోవడానికి, ఇఫ్తార్ కోసం కార్యాలయాల వేళ్లలో వెసులు బాటు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే యాప్ ద్వారా చేసుకునే వారు మాత్రమే ఫ్రొఫైల్ లో ముస్లిం అని సెలెక్ట్ చేసుకుంటేనే ఆ యాప్ అవుట్ కు అనుమతిస్తుంది.