Andhra Pradesh : మండలిని కుదిపేసిన ఇందాపూర్ డెయిరీ

శాసనమండలిని హెరిటేజ్ ఇందాపూర్ వ్యవహారం కుదిపేసింది

Update: 2026-02-19 06:56 GMT

శాసనమండలిని హెరిటేజ్ ఇందాపూర్ వ్యవహారం కుదిపేసింది. ఇందాపూర్ డెయిరీపై చర్చించానలి వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే టీడీపీ నేతలు ఇందుకు అభ్యంతరం తెలిపారు. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్ తో సంబంధం ఉందని వారి వెబ్ సైట్ లోనే ఉందని వైసీపీ శాసనసభ పక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఇందాపూర్ డెయిరీపై చర్చించడానికి ప్రభుత్వానికి అంత భయమెందుకని బొత్స ప్రశ్నించారు.

తప్పుడు ప్రచారం చేస్తూ....
దీంతో వైసీపీ సభ్యుల వ్యవహారంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ సంస్థపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రతిష్ఠను దెబ్బతీయాలనే దురుద్దేశంతో వైసీపీ సభ్యులు ఆందోళనలు చేపడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్‌కు ఎక్కడా ఎలాంటి సంబంధం లేదని గత రెండు రోజులుగా స్పష్టంగా సమాధానం ఇచ్చినప్పటికీ, అదే అంశాన్ని మళ్లీ మళ్లీ తీసుకొచ్చి సభా సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు.


Tags:    

Similar News