Chandrababu : నేడు జైపూర్ కు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు జైపూర్ కు బయలుదేరి వెళ్లనున్నారు

Update: 2026-02-19 03:13 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు జైపూర్ కు బయలుదేరి వెళ్లనున్నారు. ఐఏఎస్ అధికారి వికాస్ వివాహ వేడుకకు చంద్రబాబు హాజరు కానున్నారు. వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశించిన అనంతరం అక్కడి నుంచి రేపు చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళతారు. రేపు ఢిల్లీలో జరుగుతున్న డియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 లో పాల్గొననున్నారు.

రేపు ఢిల్లీకి వెళ్లి...
ఈ సందర్భంగా పలువురు ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కూడా చంద్రబాబు కలిసే అవకాశముంది. అయితే దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం మాత్రం ఇంకా రాలేదు. ఏఐ ఇంపాక్ట్ సదస్సు లో పాల్గొన్న అనంతరం చంద్రబాబు రేపు సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటారు. శని, ఆదివారాలు ఆయన హైదరాబాద్ లోనే ఉండే అవకాశముంది.


Tags:    

Similar News