Andhra Pradesh : ఇందాపూర్ పై దద్దరిల్లిన ఏపీ శాసనమండలి

ఇందాపూర్ డెయిరీపై వరసగా నాలుగో రోజు కూడా శాసనమండలి దద్దరిల్లింది

Update: 2026-02-20 05:31 GMT

ఇందాపూర్ డెయిరీపై వరసగా నాలుగో రోజు కూడా శాసనమండలి దద్దరిల్లింది. వైసీపీ సభ్యులు నేడు కూడా హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. మండలి ఛైర్మన్ దానిని తిరస్కరించారు. అయితే చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. మరొకవైపు వెంకటేశ్వరస్వామి ఫొటోలను తీసుకు రావడంతో టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు.

మండలికి ఫొటోలు...
దేశంలో ఎక్కడా లేని విధంగా ఫొటోలను మండలికి తీసుకు రావడం ఏంటని మంత్రి పయ్యావుల ప్రశ్నించారు. వీరికి బుద్ధి ఉందా? అని నిలదీశారు. ఇయర్ ఫోన్స్ ను విసిరిగొట్టారు. మండలి ఛైర్మన్ ను కూడా పట్టించుకోవడం లేదని, తిరస్కరించిన వాయిదా తీర్మానంపై చర్చ ఏంటని వారు ప్రశ్నించారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. నినాదాల మధ్య శాసనమండలి ఛైర్మన్ సభను కొద్ది సేపు వాయిదా వేశారు.


Tags:    

Similar News