Breaking : లడ్డూ కల్తీపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై ఏకసభ్య కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది
tirumala laddu adulteration
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై ఏకసభ్య కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఏర్పాటయిన ఈ కమిటీ దీనిపై విచారణ చేయనున్నారు. నలభై ఐదు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. టీటీడీ నిబంధనలు, అమలు పరిశీలనలో జరిగిన పొరపాట్లను ఈ కమిటీ విచారించనుంది. టీటీడీ నెయ్యి కొనుగోలు టెండర్లలో జరిగిన అవకతవకలపై అథ్యయనం చేయనుంది.
45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని...
నిర్ణయాలు సరైన విధానంలో తీసుకున్నారా? లేదా? అన్నది ఈ కమిటీ సమీక్షించనుంది. ఏకసభ్య కమిటీకి తిరుమల తిరుపతి దేవస్థానం అవసరమైన సహకారాన్ని అందించాలని కూడా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో నెయ్యి కల్తీ ఘటనపై సింగిల్ మెన్ కమిటీని నియమిస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.