Andhra Pradesh : శాసనమండలి ఛైర్మన్ కు కూటమి నేతల ఫిర్యాదు
శాసనమండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై కూటమి సభ్యులు ఆందోళనకు దిగారు.
శాసనమండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై కూటమి సభ్యులు ఆందోళనకు దిగారు. శాసనమండలి ఛైర్మన్ ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. వెంకటేశ్వరస్వామి ఫొటోలను సభలోకి తీసుకు రావడమే కాకుండా గోవిందా అంటు నినాదాలు చేయడమే కాకుండా సీట్లలో దేవుడి ఫొటోలను పడవేసి వెళ్లడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్లకార్డులను ప్రదర్శించడంపై...
సభలో ప్లకార్డులను ప్రదర్శించడంపైన, ఫొటోలను తీసుకు రావడంపైన వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి ఛైర్మన్ ను కోరారు. దేవుడిని అవమానించడమేనని అన్నారు. లోకేశ్ నాయకత్వంలో మంత్రులు, సభ్యులు శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజును కలిసి ఫిర్యాదు చేశారు. మండలి ఛైర్మన్ ఛాంబర్ వద్ద కూటమి నేతలు నిరసన తెలిపారు.