సర్పంచ్ లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
పంచాయతీ సర్పంచులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది
పంచాయతీ సర్పంచులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు ఏపీ సర్కార్ తీపి కబురు అందించింది. పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 5న చేసిన తీర్మానాల మేరకు నిధులు వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
పనులు చేసి...
పనులు చేసి, మెజర్‌మెంట్స్ పుస్తకాల్లో నమోదు చేస్తే బిల్లులు చెల్లించవచ్చని తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పంచాయతీల్లో పెండింగ్ బిల్లుల చెల్లింపులు వేగవంతం కానున్నాయి. గత కొంత కాలంగా పంచాయతీల్లో పేరుకుపోయిన అనేక సమస్యలకు నిధులు విడుదల కావడంతో సర్పంచ్ లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.