గుడ్ వర్క్ అంటూ గేట్స్ కితాబు

ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సచివాలయంలో గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు

Update: 2026-02-16 06:56 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సచివాలయంలో గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని బిల్ గేట్స్ పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి తెలుసుకున్న బిల్ గేట్స్ ఆర్టీజీఎస్‌లోని డిస్ ప్లే వాల్స్‌పై ప్రజంటేషన్లను పరిశీలించారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని సీఎం చంద్రబాబు వివరించారు. డేటా లేక్, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం బాగుందన్న గేట్స్ అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్‌లో సమారాచాన్ని సేకరించి, వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు గేట్స్‌కు సీఎం చంద్రబాబు తెలిపారు.

పాలసీల అమలుపై...
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తీరును పరిశీలించిన బిల్ గేట్స్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జీఎస్డీపీ పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ ప్రశ్నించారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని... అలాగే, భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతంగా ఉందన్న గేట్స్ ,తమ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణ తీరును బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించగా...గ్రేట్ వర్క్ అంటూ గేట్స్ కితాబిచ్చారు.


Tags:    

Similar News