చందనోత్సవం ఏర్పాట్లపై మంత్రి సమీక్ష
సింహాచలంలో జరగనున్న చందనోత్సవం ఏర్పాట్లపై మంత్రి డీఎస్‌బీవీ స్వామి సమీక్ష నిర్వహించారు.
సింహాచలంలో జరగనున్న చందనోత్సవం ఏర్పాట్లపై అధికారులు, జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి డీఎస్‌బీవీ స్వామి సమీక్ష నిర్వహించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
గత ఏడాది జరిగిన...
సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో సామాన్య భక్తులకే పెద్దపీట వేయాలని తెలిపారు. సమిష్టి కృషితో చందనోత్సవ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. గత ఏడాది జరిగిన చందనోత్సవం సందర్భంగా జరిగిన ఘటన పునరావృతం కాకుండా చూడాలని కోరారు.