Chandrababu : రేపు అనకాపల్లి జిల్లాకు చంద్రబాబు
అనకాపల్లి జిల్లాలో ఆంధ్ర్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు
అనకాపల్లి జిల్లాలో ఆంధ్ర్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. రేపు ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు. రాజయ్యపేటలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మలతో పాటు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ లు కూడా పాల్గొంటారు.
స్టీల్ ఫ్యాక్టరీకి...
ఏటా 17.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్‌ప్లాంట్ ను అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 5,465 ఎకరాల్లో రెండు దశల్లో ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.