నేడు తారాగిరి యుద్ధనౌక జాతికి అంకితం
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ నేడు విశాఖలో పర్యటించనున్నారు
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈరోజు నావికాదళంలోకి తారాగిరి యుద్ధనౌకను రాజ్ నాధ్ సింగ్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ఈ నౌకను జాతికి అంకితం చేయనున్నారు.
విశాఖపట్నం కేంద్రంగా...
విశాఖపట్నం కేంద్రంగా యుద్ధనౌక ఐఎన్ఎస్ తారాగిరి దేశానికి సేవలు అందించనుంది. బ్రహ్మోస్ క్షిపణిని మోసుకెళ్లగల సత్తా ఉన్న ఐఎన్ఎస్ తారాగిరి భారతీయ నౌకాదళంలో మరొక రక్షణ కవచమని చెబుతున్నారు. భారతీయ నౌవికాదళం అమ్ముల పొదిలోనేడు తారాగిరి చేరనుంది. రాజ్ నాధ్ సింగ్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.