Tue Jan 20 2026 10:02:04 GMT+0000 (Coordinated Universal Time)
BRS LP Leader: బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరగనుంది. శాసనసభ

తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరగనుంది. శాసనసభ ప్రొటెమ్ స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ నేతను ఎన్నుకున్నారు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ శాసన సభాపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో తీర్మానం చేయనున్నారు.
కాసేపట్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఈ తీర్మానం చేయనున్నారు. అలాగే డిప్యూటీ ఎల్పీ లీడర్గా మరొకరిని ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ తీర్మానం కాపీ అసెంబ్లీ కార్యదర్శికి ఇవ్వనుంది బీఆర్ఎస్ ఎల్పీ. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బస్సులోనే వెళ్లనున్నారు.
Next Story

