టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

బాబోయ్ కొత్త సైబర్ స్కాం! రైతుబంధువును ఆదరించండి, రాబందులను తరిమికొట్టండి ,ఫాంహౌస్ సీఎంను ఇంటికి పంపాల్సిందే, ఇంకా మరెన్నో

Update: 2023-11-27 12:45 GMT


రైతుబంధువును ఆదరించండి.. రాబందులను తరిమికొట్టండి: కేటీఆర్

రైతుబంధు పడకుండా కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుందని ఆరోపించారు మంత్రి కేటీఆర్. రైతుబంధుపై కాంగ్రెస్‌ వక్రబుద్ధి బయటపడిందని.. కాంగ్రెస్‌ ఉంటే కరెంటు ఉండదని.. ధరణిని రద్దుచేసి పట్వారీ వ్యవస్థ మళ్లీ తెస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారన్నారు కేటీఆర్. కరెంటు కావాలా.. కాంగ్రెస్‌ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ధర్మపురిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్‌ షోలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధు తీసేస్తారు.

మద్యం కేసులో చంద్రబాబు నాయుడికి ఊరట

మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రలపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఈ కేసుపై హైకోర్టులో విచారణకు రాగా తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. గతంలో వాదనలు పూర్తికావడంతో లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు చంద్రబాబు, సీఐడీ తరపు న్యాయవాదులు లిఖిత పూర్వక వాదనలు సమర్పించారు.

Narendra Modi : హైదరాబాద్‌లో మోదీ రోడ్ షో.. మూడు కిలోమీటర్ల మేరకు

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. మూడు కిలోమీటర్ల రోడ్ షోలో ప్రధాని పాల్గొన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడలోని వీర సావర్కర్ విగ్రహం వరకూ రోడ్ షో నిర్వహించారు. దారి పొడువునా ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ కనిపించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణగూడ, వైఎంసీఏ చౌరస్తా, కాచిగూడ క్రాస్ రోడ్స్ వరకూ మోదీ రోడ్ షో కొనసాగుతుంది. మోదీని చూసేందుకు దారిపొడువునా పెద్దయెత్తున ప్రజలు హాజరయ్యారు.

ఆడుదాం ఆంధ్ర.. ఆడడానికి మీరు సిద్ధమైతే!!

ఏపీలో 'ఆడుదాం-ఆంధ్ర' క్రీడా పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. క్రీడల్లో విజేతలకు ప్రభుత్వం నగదు బహుమతులు ప్రకటించింది. గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి ఐదు దశల్లో పోటీలను నిర్వహించనున్నారు. ప్రతి దశలోనూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంతో పాటుగా విజేతలను సర్టిఫికెట్స్, మెమెంటోలు, నగదు పురస్కారాలతో సత్కరించనుంది. 15ఏళ్లు పైబడిన వయసున్న బాలబాలికలు అందరిని పోటీలలో భాగస్వాముల్ని చేసేలా 'ఓపెన్‌ మీట్‌'ను పోటీలు చేపడుతున్నారు.

Telangana Congress : కాంగ్రెస్ కు అనుకూల ట్రెండ్ ఎందువల్ల?...ఇవి కదా కారణాలు

ఎక్కడ చూసినా ఒకటే టాక్. ఒకటే ట్రెండ్.. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని. ఎందుకొచ్చిందో ఈ వేవ్ అర్థం కాకపోయినా ఈరోజు కూడా అదే ట్రెండ్ కొనసాగుతుంది. పల్లె నుంచి పట్టణాల వరకూ.... చివరకు హైదరాబాద్ నగరంలోనూ కాంగ్రెస్ కు అనుకూలంగా బలమైన గాలులు వీస్తున్నాయన్న మౌత్ టాక్ వినిపిస్తుంది. ఎవరి నోట విన్నా ఇదే మాట. తెలంగాణ రాష్ట్రమిచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అధికారం ఇస్తే తప్పేంటంట? అన్నది కూడా ప్రజల్లో నాటుకుపోయింది.

ఆ డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్ మూడేళ్ళలో చేసిన దారుణాలు ఎలాంటివంటే?

గత మూడేళ్లలో దాదాపు 900 అక్రమ అబార్షన్లు చేసిన డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్‌ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ చందన్ బల్లాల్, అతని ల్యాబ్ టెక్నీషియన్ మైసూరులోని ఒక ఆసుపత్రిలో ఈ అబార్షన్లు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన ప్రతి అబార్షన్‌కు సుమారు రూ. 30,000 వసూలు చేశారు. వారిద్దరి గురించి ఫిర్యాదు అందడంతో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆసుపత్రి మేనేజర్ మీనా, రిసెప్షనిస్ట్ రిజ్మా ఖాన్‌లను ఇప్పటికే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ల్యాండ్, శాన్డ్, వైన్ మాఫియాలతో ఈ ప్రభుత్వం కూరుకుపోయిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. ప్రచారం ముగింపు దశకు వచ్చిందని, మూడు రోజుల్లో ఓటేస్తారని ఆమె అన్నారు. కొడంగల్ ప్రియాంక గాంధీ మాట్లాడారు. రేవంత్ రెడ్డిని గెలిపించాలని కోరారు. తెలంగాణ కోసం వందల మంది ప్రాణత్యాగం చేశారన్నారు. ఈ దేశం కోసం మా కుటుంబ సభ్యులు ప్రాణాలు అర్పించారని తెలిపారు. ప్రాణత్యాగాలు వృధా కానివ్వవద్దని కుటుంబ సభ్యులు కోరుకుంటారని అన్నారు.
ఫాం హౌస్ ముఖ్యమంత్రికి మరోసారి అధికారమిస్తారా? అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. మహబూబాబాద్ లో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. తెలంగాణకు ఫాం హౌస్ సీఎం అవసరం లేదన్నారు. తెలంగాణాలో బీజేపీ కొత్త చరిత్ర సృష్టించబోతుందన్నారు. ఎన్డీఏలో చేర్చుకోకపోవడంతోనే తనను బీఆర్ఎస్ నేతలు తిట్టడం మొదలుపెట్టారన్నారు. బీఆర్ఎస్ చేసిన స్కామ్ లన్నింటిపై తాము దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
మీకో పార్సల్ వచ్చిందంటూ.. వివిధ నగరాలకు చెందిన ప్రజల నుంచి లక్షలాది రూపాయలను దోచుకుంటున్న కత్త మోసం తాజాగా వెలుగు చూసింది. దీనిని కొరియర్ స్కామ్ అని పిలుస్తున్నారు. ఇందుకు సంబంధించి.. మోసగాళ్లు తమను తాము పోలీసు అధికారులు, కస్టమ్ అధికారులు, NCRB ఏజెంట్‌లు చెప్పుకుంటూ ఉంటారు. మాదకద్రవ్యాలు, ఇతర నిషేధిత పదార్ధాలు వంటి నిషిద్ధ వస్తువులు ఉన్న పార్శిల్‌ మీకు వచ్చిందని చెబుతూ బెదిరింపులకు దిగుతూ ఉంటారు.
ఒకప్పుడు నార్త్ ఆడియన్స్ కి సౌత్ హీరోలు అంటే.. కేవలం రజినీకాంత్ మాత్రమే. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, యశ్, అల్లు అర్జున్ కూడా ఈ లిస్టులోకి వచ్చి చేరారు. వీరిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఇండియా వైడ్ భారీ ఫేమ్ ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం నార్త్ లో ఏ సౌత్ స్టార్ కి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకున్నారు అల్లు అర్జున్. తాజాగా ఈ హీరో ఓ విషయంలో రజినీని మించి పోయారు

Tags:    

Similar News