Fri Mar 20 2026 11:19:15 GMT+0530 (India Standard Time)
Breaking : రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి
రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణించారు. ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా ప్రమాదం జరిగింది

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణించారు. ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా ప్రమాదం జరిగింది. ఉండి మండలం చెరుకువాడ సమీపంలో ఎమ్మెల్సీ సాబ్జీ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో సాబ్జి మృతి చెందారు. డ్రైవర్ కు, ఆయన గన్ మెన్ కు తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిలో...
అంగన్ వాడీ కార్యకర్తల ఆందోళన కార్యక్రమంలో పాల్గొని వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికత్సి అందిస్తున్నారు. ప్రస్తుతం సాబ్జీ మృతదేహాన్ని భీమవరానికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనస్థలికి పోలీసులు చేరుకుని సహాయక కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిసింది.
Next Story

