Sat Mar 07 2026 11:30:10 GMT+0530 (India Standard Time)
Breaking : మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ను నియమిస్తూ బీజేపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ను నియమిస్తూ బీజేపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో మోహన్ యాదవ్ మంత్రిగా పనిచేశారు. స్పీకర్ గా నరేంద్ర సింగ్ తోమర్ ను నియమించే అవకాశాలున్నాయని తెలిసింది. మధ్యప్రదేశ్ సిఎం ఎవరన్న ఉత్కంఠకు ఎట్టకేలకు బీజేపీ అధినాయకత్వం తెరదించినట్లయింది.
మంత్రిగా పనిచేసిన...
ఉజ్జయిని సౌత్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ యాదవ్ ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అధికారికంగా ప్రకటన చేశారు. ఉప ముఖ్యమంత్రులుగా జగదీష్ దేవ్డా, రాజీవ్ శుక్లా లను నియమిస్తూ బీజేపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ముఖ్యమంత్రి పదవుల విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకుంటుంది.
Next Story

