హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం

Update: 2017-03-23 06:47 GMT

భాగ్యనగరంలో డ్రగ్స్ మరోసారి కలకలం రేపింది. నగరంలోని జూబ్లీహిల్స్‌‌లో నైజీరియన్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి టాస్క్‌పోర్స్ పోలీసులు తనిఖీలు చేపడుతుండగా ఈ క్రమంలో నైజీరియన్ అనుమానస్పదంగా కనిపించడంతో అతన్ని చెక్ చేశారు. ఈ నైజీరియన్ వద్ద 50గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే నైజీరియన్ ఎవరికి సప్లై చేస్తున్నారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని అందులో ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ లో ఇటీవల కాలంలో డ్రగ్స్ ఎక్కువగా సరఫరా అవుతున్నట్లు పసిగట్టిన పోలీసులు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచారు. ముఖ్యంగా సంపన్నులు, సీనీ పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులకు ఈ డ్రగ్స్ అందుతున్నట్లు గతంలో వెల్లడయింది. అందుకోసమే డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా బృందాలను హైదరాబాద్ పోలీసులు ఏర్పాటు చేశారు.

Similar News