సర్కార్ కు వార్నింగ్ ఇచ్చిన మంత్రి మాణిక్యాలరావు

Update: 2018-01-10 14:06 GMT

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి గూడెం నియోజకవర్గం రామన్నగూడెంలో ఆయన జన్మభూమికార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను రామన్నగూడెంలో జరిగే ఏ కార్యక్రమానికి ఆహ్వానించడం లేదని పరోక్షంగా జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజుపై విమర్శలు చేశారు. తన నియోజకవర్గంలోనే తనను అంటరాని వాడిగా చూస్తున్నారన్నారు. తనను నిలదీయాలని ప్రయత్నిస్తే తాను ప్రభుత్వాన్నే నిలదీస్తానని హెచ్చరించారు. తనను కట్ చేయాలని చూస్తే ఏపీని కూడా కట్ చేస్తానని తీవ్రస్వరంతో వార్నింగ్ ఇచ్చారు. దీంతో మంత్రి వ్యాఖ్యలకు అక్కడే ఉన్న టీడీపీ, బీజేపీ నేతలు అవాక్కయ్యారు.

Similar News