శ్రీదేవికి అంతిమ వీడ్కోలు

Update: 2018-02-28 09:28 GMT

అందాల తార శ్రీదేవికి అంతిమ వీడ్కోలు పలికారు. అధికార లాంఛనాలతో అంతిమ యాత్ర ప్రారంభమయింది. శ్రీదేవిని కడసారి చూసేందుకు సినీ లోకమంతా తరలి వచ్చింది. హిందూ శ్మశానవాటికలో శ్రీదేవి అంత్యక్రియలు మరికొద్దిసేపట్లో పూర్తి కానున్నాయి. శ్రీదేవికి చివరి సారిగా బంగారు వర్ణంతో కూడిన కంచిపట్టు చీరను కట్టారు. ఆమెకు కంచి చీరలంటే ఇష్టం కావడంతో కంచీపురం చీరను కట్టారు. భౌతిక కాయానికి అనేకమంది ప్రముఖులు నివాళులర్పించారు. తెల్లటి పూలతో ఆమె భౌతిక కాయాన్ని తీసుకెళ్లే వాహనాన్ని అలంకరించారు. శ్రీదేవికి తెలుపంటే ఇష్టం.

Similar News