వ్యాపారులకు ఆర్బీఐ వరం

Update: 2017-01-30 14:30 GMT

ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు చెప్పేసింది. కరెంట్ ఖాతాల నుంచి నగదు ఉపసంహరణపై ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై వ్యాపారులు తమ కరెంట్ ఖాతాలనుంచి ఎంతమొత్తమైనా విత్ డ్రా చేసుకునేందుకు వీలు కల్పించింది. ఈ ఆంక్షలు ఎత్తివేత ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఆర్బీఐ వర్గాలుచెప్పాయి. అయితే సేవింగ్స్ ఖాతాల నుంచి మాత్రం నగదు ఉపసంహరణ పరిమితిని సడలించలేదు. సేవింగ్స్ ఖాతాదారులు వారానికి 24 వేల రూపాయలు మాత్రమే విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రధాని మోడీ నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆర్బీఐ నగదు ఉపసంహరణపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఎన్నికల సంఘం వినతిని కూడా ఆర్బీఐ తిరస్కరించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో నగదు ఉపసంహరణ పరిమితులను ఎత్తివేయాలని ఆర్బీఐని ఎన్నికల కమిషన్ కోరింది. అభ్యర్ధులు ఎన్నికల ఖర్చు నిమిత్తం అవసరమవుతుందని ఎన్నికల కమిషన్ భావించే ఈ ప్రతిపాదన ఆర్బీఐ ముందుంచింది. కాని ఆర్బీఐ ఇందుకు అంగీకరించలేదు. అయితే కరెంట్, ఓడి ఖాతాలకు మాత్రం నిబంధనలను మాత్రం సడలించింది.

Similar News