ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మరో సారి షాక్ తగిలింది. పశు దాణా కేసుకు సంబంధించి నాలుగో కేసులో కూడా లాలూ యాదవ్ ను రాంచీ సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించింది. కొద్దిసేపటి క్రితం ఈ తీర్పు చెప్పింది. అయితే ఇదే కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న జగన్నాధ్ మిశ్రాకు ఈ కేసులో ఊరట లభించింది. అయితే ప్రస్తుతం లాలూ యాదవ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే కోర్టుకు హాజరయ్యారు. శిక్షలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. లాలూ ఇదే కేసులో బిర్సాముండా జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.