చిత్తూరు జిల్లాలోని పుత్తూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా విన్నూత్న నిరసన తెలియజేశారు. చెవిలో పూలు పెట్టుకుని మరీ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులు అల్లాడి పోతున్నారని, బాబు వస్తే జాబు వస్తుందని నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత యువతను పట్టించుకోవడం మానేసిందన్నారు రోజా. ప్రత్యేక హోదాను కూడా పక్కన పెట్టడంతో ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు రావని తేల్చేశారని అన్నారు రోజా. పరిశ్రమల కోసం విదేశాల చుట్టూ తిరుగుతున్న చంద్రబాబు ఈ మూడున్నరేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా ఏపీకి తీసుకురాలేదన్నారు. పుత్తూరులో రోజా నిర్వహించిన ఈ భారీ ర్యాలీకి మంచి స్పందన లభించింది. చిత్తూరు జిల్లాలోనే ప్రస్తుతం జగన్ పాదయాత్ర జరుగుతున్న సంగతి తెలిసిందే.